
ఏలూరు,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (AI TUC) ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు ఉప్పులూరి హేమ శంకర్, ఏలూరు ఏరియా ప్రధాన కార్యదర్శి ఏ అప్పలరాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరించారు.
వారు పేర్కొన్న ప్రధాన డిమాండ్లు:
ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలి.
ఇంజనీరింగ్ విభాగ సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలి.
మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి.
గ్రాడ్యుటీ చట్టం అమలు చేసి, పిఆర్సి ప్రకారం 30% మద్యంతర భృతి ఇవ్వాలి.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి.
ఈ ధర్నాలో యూనియన్ ప్రధాన కార్యదర్శి దొడ్డికర్ల నాగబాబు, అధ్యక్షులు బంగారు అక్కమ్మ, కోశాధికారి ఇంటి అశోక్, పేడారి వంశి జానకిరామ్, ఇంజనీర్ సెక్షన్ కోశాధికారి బి.నారాయణరావు, సహాయ కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు కూరెళ్ళ వరప్రసాద్, అడ్డగర్ల లక్ష్మి ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు కొనసాగుతాయని, జూలై 7న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.