అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పక్షుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు..

అనకాపల్లిలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పక్షుల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు..

19/April/2026 13:24    Share:   

అనకాపల్లి, మే 2026:
పక్షులు సంతోషంగా ఉంటేనే పకృతి సంతోషంగా ఉంటుంది....అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. ప్రేమ్ కుమార్
వేసవి తీవ్రతల నేపథ్యంలో పక్షుల సంరక్షణకు గ్రీన్ క్లబ్ అనకాపల్లి మరో విశిష్ట కార్యక్రమం చేపట్టింది. పట్టణంలోని వివిధ పార్కుల్లో పక్షుల కోసం తాగునీటి పాత్రలు, ధాన్యపు కుంచులు, గూళ్లను ఏర్పాటు చేశారు.గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ, వృక్షమిత్ర పురస్కార గ్రహీత శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ మాట్లాడుతూ – ప్రతి ఇంటి ముందు చిన్న నీటి పాత్ర, కొద్దిగా ధాన్యం గింజలు ఉంచడం ద్వారా అనేక పక్షుల ప్రాణాలు కాపాడవచ్చని, ఇది చిన్న చర్య అయినా గొప్ప సేవ అని కోరారు.ఈ సందర్భంగా గవరపాలెం పార్క్, మార్కెట్ యార్డ్, గాంధీనగర్ పార్క్, శారదా నది ఘాట్ పార్కులలో మొత్తం 45 ధాన్యపు కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్లు ఏర్పాటు చేశారు. పక్షుల సంరక్షణకై గ్రీన్ క్లబ్ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ శ్రీ కాండ్రేగుల త్యనారాయణ, విశ్రాంత అటవీ శాఖ రేంజర్ శ్రీ బీరా వినోద్ కుమార్, పెంటకోట ఉమామహేశ్వరరావు, జగన్నాథ్ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ దాడి బుజ్జి, నైశెట్టి సత్తిబాబు, బేతాళం శేష సాయి, గ్రీన్ క్లబ్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి రావూరి అనిత, గ్రంధి రంజిత, సుంకర పద్మలత, భానుమతి, వై శైలజతో పాటు పెద్ద సంఖ్యలో గ్రీన్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.స్థానికులు గ్రీన్ క్లబ్ సేవలను అభినందించడం విశేషం.

Breaking News

Subscribe our Newsletter