
యలమంచిలి పంచ నవరాత్రుల ఉత్సవాలకు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు - పార్కింగ్ నిబంధనలు విడుదల
యలమంచిలి, నవంబర్ 13: శ్రీ శ్రీ యలమంచిలి భూలోకమాంబ, సుబ్రమణ్యేశ్వర స్వామి పంచ నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్, పార్కింగ్ నిబంధనలు విడుదల చేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, పట్టణ, గ్రామ ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు.
పార్కింగ్ ఏర్పాట్లు ఇలా...
1. అనకాపల్లి వైపు నుండి వచ్చేవారు: ఎలమంచిలి ఎంట్రన్స్ లోని గోవింద్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న చెరుకుల ఖాటా వద్ద ఖాళీ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయాలి. అలాగే శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ కింద కూడా పార్కింగ్ చేసుకోవచ్చు.
2. తుని వైపు నుండి వచ్చేవారు: ఎలమంచిలి ఎంట్రన్స్ లోని విజయలక్ష్మీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలి.
3. అచ్యుతాపురం వైపు నుండి వచ్చేవారు: నవంబర్ 13 సాయంత్రం 4 గంటల నుండి ఎలమంచిలి కల్కి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న పెంకుల ఫ్యాక్టరీ సమీప ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలి.
4. ఎస్.రాయవరం నుండి వచ్చేవారు: నవంబర్ 13 సాయంత్రం 4 గంటల నుండి యలమంచిలి రామచంద్రమ్మ గుడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు నిలపాలి.
భారీ వాహనాలకు నిషేధం:
నవంబర్ 13 ఉదయం 11 గంటల నుండి భారీ వాహనాలకు యలమంచిలి ఊరిలోకి ప్రవేశం నిషేధించారు. వాటిని హైవే మీదుగా అనకాపల్లి వైపు మళ్లించారు. కంపెనీలకు వెళ్లే బస్సులు, లారీలు అచ్యుతాపురం మీదుగా అనకాపల్లి హైవేకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
భక్తులకు ముఖ్య సూచనలు:
భక్తులు పోలీసుల నిబంధనలు పాటించి ఉత్సవాల విజయవంతానికి సహకరించాలని నిర్వాహకులు, పోలీసులు కోరారు.