మాట తప్పని సేవ: ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నిరాటంకంగా ఉచిత వైద్య సేవలు
11/June/2026 20:32
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, పరోపకారమే పరమావధి అనే సూక్తిని ఆచరణాత్మకంగా చూపుతూ ప్రజోపయోగకర సేవలను మరింత విస్త్రృతం చేసుకుంటూ ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ఉచిత వైద్య శిబిరాల ద్వారా అవసరార్థులకు వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవసరార్థులకు సాయం అందించే విషయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎప్పుడూ ముందే ఉన్నారు. తానేం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా ప్రజలకు వివరిస్తూ, తాను చేయాలనుకున్న మంచిని నిస్వార్థంగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేక్రమంలో ఆయన ఆలోచనల నుండి పుట్టిన ఉచిత వైద్య శిబిరాలు ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఇదేక్రమంలో ఈ గురువారం కూడా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తొలుత మెడికల్ క్యాంపునకు విచ్చేసిన వారిలో అవసరమైన వారికి వైద్య సిబ్బంది రక్త పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి, మందులను అందించారు. ఈ సందర్భంగా శిబిరం కొనసాగుతోన్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే అవసరార్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇదేసమయంలో సామాజిక సేవలో భాగంగా ఏలూరుకు చెందిన ప్రముఖ బంగారు వ్యాపారస్తులు గ్రంథి అమరేంధ్ర, అంబికా అనసూయ దంపతులు 50వేల రూపాయల విలువైన మందులను ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇదేవిధంగా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి యాక్ట్‌తో మాట్లాడుతూ తానిచ్చిన స్ఫూర్తిని అందుకున్న అనేక మంది ముందుకొచ్చి సేవల్లో భాగస్వాములు కావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇదేక్రమంలో మరింత మంది దాతలు దాతృత్వంతో ముందుకొచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జ్ లు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...