రెవెన్యూ అంశాలపై కలెక్టరు కె.వెట్రిసెల్వి సుదీర్ఘ సమీక్ష..
30/July/2026 19:21
Share:
@అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పోటీతత్వంతో పనిచేసి,లక్ష్యాలను అధిగమించాలి. @అర్హులకు సంక్షేమ ఫలాలు, పౌరసేవలు అందించుటలో మనస్సుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. @అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులకు శాఖా పరమైన చర్యలు తప్పవు.జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఏలూరు, జిల్లా కలెక్టరేటు గోదావరీ సమావేశ మందిరంలో గురువారం రెవిన్యూ పరమైన పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు, లావాదేవీలు మరియు సవరణలు కోసం మ్యూటేషన్, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, అర్హులు అందరికీ గృహాలు, ఐవిఆర్ఎస్ పోనుకాల్స్, ఆర్ వోఆర్ కేసులు, 22 (ఏ) కేసులు, కోర్టుకేసులు, డిజిటలైజేషన్ రెవెన్యూ ఇన్వెంటరీ, వరద మరియు విపత్తునిర్వహణ తదితర 14 అంశాలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి యం.శ్రీదేవి లు పాల్గొన్నారు. ఒక్కొక్క అంశం మీద మండలాలు వారీగా సమీక్షించి, నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. లక్ష్యాలులో వెనుకబడిన అధికారులకు చర్యలు తప్పవని జిల్లా కలెక్టరు హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలు అధిగమించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించుటలో మనస్సుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు. పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు అర్జీలు శాశ్వత పరిష్కారం చూపాలి అన్నారు. కొందరు అధికారులు మాశాఖకు సంబంధించింది కాదని, కాలయాపన చేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వివాదాలకు తావులేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు రూపొందించాలని, అర్హులు అయిన వారందరికీ అందజేయ్యాలని అన్నారు. పౌరసేవలో ఎక్కడ కూడా ఒక్కఫిర్యాదు రాకుండా ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహాలు మంజూరు చెయ్యాలని, నిర్మాణంలో ఉన్న గృహాలను వేగవంతం చేసి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని అన్నారు. కొన్ని శాఖలు పనితీరుపై ఐవిఆర్‌ఎస్ రిపోర్టులు వివరిస్తూ, అసహనం వ్యక్తం చేస్తూ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. కోర్టుకేసులు పురోగతిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలని, కాలయాపనలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. గత అనుభవాలను జోడిస్తూ వరదలుపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలాలు వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ, కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం చెయ్యాలని అన్నారు. ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచెయ్యాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగులో ఉన్న ధరఖాస్తులు, ఫిర్యాదులు, కేసులను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, రెవెన్యూ సేవలు అందించుటలో పారదర్శకత, జవాబు దారీతనంతో పనిచెయ్యాలని సూచించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న,విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎల్.దేవకీదేవి, ఆర్డీవోలు కె.లక్ష్మీప్రసన్న, యం.వి.రమణ, సంబంధిత జిల్లా అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.