పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి,ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు
11/July/2026 21:18
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్ గారికి రెండు భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు గారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ప్రజా సేవకులు మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్. అహర్నిశలు ప్రజల పక్షాన నిలబడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం అన్నారు. ఆయన సంకల్ప బలం, పోరాట పటిమ ముందు ఎలాంటి అనారోగ్యమైనా తలవంచాల్సిందే అన్నారు. శస్త్రచికిత్స నుండి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో, నూతనోత్తేజంతో తిరిగి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు, జనసైనికులు మరియు ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు.. దశాబ్ద కాలానికి పైగా తీవ్రమైన భుజం నొప్పిని భరిస్తూనే ప్రజాసేవను జనసేన పార్టీ సిద్ధాంతాల సాధనను తన ధ్యేయంగా కొనసాగించిన వారి అంకిత భావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అన్నారు.. భగవంతుని ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, మంచి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత కాలం తన అమూల్యమైన సేవలందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామన్నారు..