కట్టుబాట్లకు లంక గ్రామాలు కేరాఫ్‌ అడ్రస్‌,ఎమ్మెల్యే బడేటి చంటి !

కట్టుబాట్లకు లంక గ్రామాలు కేరాఫ్‌ అడ్రస్‌,ఎమ్మెల్యే బడేటి చంటి !

22/August/2026 19:14    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
అసలు సిసలైన కట్టుబాట్లకు లంక గ్రామాలు కేరాఫ్‌ అడ్రస్‌ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. అవి భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా లంక గ్రామాల ప్రజల అభ్యున్నతికి, ఐక్యతకు సైదు గంగరాజు చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే చంటి కొనియాడారు. ఏలూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రాష్ట్ర వడ్డి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కొల్లేరు లంక గ్రామాల నాయకులు, దివంగత సైదు గంగరాజు 103వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం సైదు గంగరాజు చిత్రపటానికి ఎమ్మెల్యే చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే విద్యలో విశేష ప్రతిభ కనపరిచిన కొల్లేరు గ్రామాలకు చెందిన విద్యార్ధినీ, విద్యార్ధులకు సైదు గంగరాజు అవార్డు 2026 పేరుతో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. హైస్కూల్ స్థాయిలో అత్యధిక మార్కులతో ప్రతిభ చాటిన 9మంది కొల్లేరు లంక గ్రామాలకు చెందిన విద్యార్ధులకు మృత్యుంజయ ఉమామహేశ్వరరావు, గోపికృష్ణలు సమకూర్చిన బహుమతులు అందించారు. ఒక్కొక్క విద్యార్దికి ఐదువేల రూపాయల నగదు, జ్ఞాపిక, పుస్తకాలు, ప్రశంసా పత్రాలను అందించిన ఎమ్మెల్యే,, వారు విద్యలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కొల్లేరు లంక గ్రామాల ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కట్టుబాట్లకు కొల్లేరు గ్రామాల ప్రజలు ఇచ్చే విలువలు ఎంతో ఆదర్శనీయమని చెప్పారు. దివంగత సైదు గంగరాజు ఐక్యతకు మారుపేరుగా కొల్లేరు ప్రాంతాన్ని నిలపడంలో కృతకృత్యులయ్యారని ఎమ్మెల్యే కొనియాడారు. కొల్లేరు వాసుల హక్కుల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాల్లో మమేకమయ్యారని చెప్పారు. గంగరాజు చేసిన సేవలకు కొనసాగింపుగా వారి వారసులంతా సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు నిర్వహించాలని ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఇదేసమయంలో రాష్ట్ర వడ్డి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి సహకరించాలని కోరిన విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, అందుకు అవసరమైన సాయాన్ని తనవంతుగా అందిస్తానని, దాంతోపాటూ లంక గ్రామాల ప్రజలంతా ఐక్యంగా, బాధ్యతగా దీనికి ముందుకు రావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని దుశ్శాలువాతో, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీపీ పెన్మెత్స శ్రీనివాసరాజు, చింతపల్లి వెంకటనారాయణ, వడ్డి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్ గాయత్రీ సంతోషి, తాతపూడి చందు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter