రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని, ఎలమంచిలి నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నారాయణపురంలోని శ్రీ లక్ష్మీదేములు కన్వెన్షన్ హాల్ నందు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించబడింది.ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (AP RDC) చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు:బత్తుల తాతయ్య బాబు గారు - జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండపల్లి అప్పలనాయుడు గారు - అనకాపల్లి జిల్లా ఎన్నికల అబ్జర్వర్ పప్పల చలపతిరావు గారు - మాజీ పార్లమెంట్ సభ్యులు (MP)
వీరితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు ఆశావాహులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు మరియు పేర్లను ఈ సమావేశంలో సేకరించడం జరిగింది. నియోజకవర్గంలో పార్టీని గెలిపించే దిశగా, ప్రజాదరణ పొందిన అభ్యర్థుల పేర్లను సమగ్రంగా పరిశీలించి త్వరలోనే టీడీపీ అధిష్టానానికి నివేదించనున్నట్లు నేతలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, సమన్వయంతో పనిచేసి వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర సెక్రెటరీ రాజన రమేష్ గారు, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ దూళి రంగనాయకులు, ఎక్స్ రాష్ట్ర సెక్రెటరీ కర్రీ సాయి కృష్ణ, యువ నాయకులు గొంతిన వెంకట హరీష్, మండల పార్టీ ప్రెసిడెంట్లు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గొర్ల శివ నారాయణమూర్తి, పెంటకోట విజయ్, పీల తులసీరామ్, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ భీమశెట్టి శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివప్పరావు, మాది కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం m, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ధర్మిరెడ్డి నాయుడు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు మంజు,పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు కొత్తలి రాజు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మండల ప్రధాన కార్యదర్శిలు: కాండ్రేగుల అప్పారావు, ఆడారి ఆదిమూర్తి, కరెడ్ల ఈశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్లు: కులుకులూరి విజయబాబు, దేశంశెట్టి వెంకటరమణ, ఎరిపిల్లి చిట్టిబాబు, ఎక్స్ ఎంపీపీ వాడిశెల శ్రీనివాసరావు, ఎక్స్ జెడ్పిటిసి నారాయణమ్మ, పూడిమడక ఎక్స్ సర్పంచ్ బాపు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.