మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు, నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ !పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైఎస్ జగన్ అన్నారు.