గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పేస్ యాప్ ని రద్దు చేయాలి , సిఐటియు

గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో పేస్ యాప్ ని రద్దు చేయాలి , సిఐటియు

15/May/2026 15:05    Share:   

ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలో కొనసాగించి వి బి గ్రాంజి పథకాన్ని రద్దు చేయాలని ఈరోజు ఆవరాజ్యం, అవసోమవారం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, కన్వీనర్ కె సోము నాయుడు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బడ్జెట్లో కేటాయింపులు తగ్గించి కూలీలకు కనీస వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని గతంలో పార, గుణపం, తట్టా, మేటుకి వంటికి డబ్బులు ఇచ్చేవారని నేడు వాటిని రద్దుచేసి సమ్మర్ అలవెన్స్ కూడా తీసేసారని దీంతో ఎండలో పనిచేస్తున్న కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు కావడంలేదని ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం 307 రూపాయలు ఎటువంటి కోతలు లేకుండా ఇవ్వాలని కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ యాప్ ని రద్దు చేయాలని పని ప్రదేశంలో టెంట్లు, మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె దుర్గాప్రసాద్ కె నాగేశ్వరరావు ఎన్ సత్యవతి బి కుమారి కె ధనలక్ష్మి పి నాగమణి టి అనురాధ సిహెచ్ వరలక్ష్మి పి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter