పేదల ఆరోగ్యానికి పెద్దపీట:  అనకాపల్లిలో లబ్ధిదారురాలికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..

పేదల ఆరోగ్యానికి పెద్దపీట: అనకాపల్లిలో లబ్ధిదారురాలికి సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..

15/May/2026 17:25    Share:   

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ల చొరవతో కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి (CMRF) చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది.
స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో, మాజీ మంత్రి మరియు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిబ్బపాలెం గ్రామానికి చెందిన మట్ట గోవింద గారి పిన్ని జి. మల్లేశ్వరి గారికి మంజూరైన రూ. 11,000 సీఎం సహాయ నిధి చెక్కును అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రాంకీ గారు లబ్ధిదారురాలికి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ భీమరశెట్టి రాంకీ మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు, ఆపరేషన్ల నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయ నిధి ముఖ్య ఉద్దేశమని ఆయన లబ్ధిదారులకు వివరించారు.
ఈ ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రివర్యులకు, సహకారం అందించిన ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గారికి, అలాగే చెక్కు అందజేసిన శ్రీ రాంకీ గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీనివాస్ ఏక్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.
Breaking News

Subscribe our Newsletter