యలమంచిలి: నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మించిన నూతన ఓపీ (Outpatient) భవనాన్ని యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఈరోజు ప్రారంభించారు ఈ భవనాన్ని టొయోత్సు రేర్ ఎర్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Toyotsu Rare Earths India Pvt Ltd) కంపెనీ వారు తమ సి.ఎస్.ఆర్ (CSR) నిధుల సౌజన్యంతో నిర్మించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకరించిన టొయోత్సు కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన సౌకర్యాలతో స్థానిక ప్రజలకు, పేద రోగులకు మరింత వేగంగా మరియు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, టొయోత్సు కంపెనీ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.