యలమంచిలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!!

యలమంచిలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!!

03/April/2026 10:19    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
యలమంచిలి న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల సమక్షంలో ఈ ఎన్నికలు సాఫీగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా అధ్యక్షులుగా పెరుమాళ్ల వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా లాలం వెంకట రామకృష్ణారావు, కార్యదర్శిగా ముత్తిరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా నగిరెడ్డి సత్యనారాయణ, కోశాధికారిగా చల్లా అరుణశ్రీ, అలాగే ఇతర కీలక పదవులకు కూడా సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను న్యాయవాదులు అభినందిస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాల విస్తరణ, మరియు సంఘ ఐక్యతను పెంపొందించడంలో కొత్త కార్యవర్గం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Breaking News

Subscribe our Newsletter