ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారు, గవరపాలెం, అనకాపల్లి, శ్రీ అమ్మవారి, పండగ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది ఈనెల అనగా మార్చి 8న శ్రీ అమ్మవారి పునర్నిర్మాణ కలశ స్థాపన, ప్రతిష్ట మహోత్సవముల ఆహ్వానపత్రిక లను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి వర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు చేతుల మీదుగా ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఆలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాటులు లేకుండా పరిపూర్ణంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యాళ్ళశ్రీధర్ ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్ కుమార్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు, యర్రవరపు సంతోషి కుమారి నాగేష్, తదితరులు పాల్గొన్నారు,