ఫైర్‌క్రాకర్ తయారీ మరియు నిల్వ యూనిట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

ఫైర్‌క్రాకర్ తయారీ మరియు నిల్వ యూనిట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

05/March/2026 20:31    Share:   

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  కోప్పాక, రాజుపాలెం, మరియు వల్లూరు గ్రామాల్లో ఉన్న ఫైర్‌క్రాకర్ తయారీ మరియు నిల్వ యూనిట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనకాపల్లి డీఎస్పీ మేడమ్ శ్రీమతి M. శ్రావణి గారి నేతృత్వంలోని బృందం లైసెన్స్ చెల్లుబాటు, స్టాక్ స్థాయిలు, మరియు  స్టాక్ రిజిస్టర్లతో సరిపోల్చారు, అగ్ని ప్రమాద భద్రతా నిబంధనల పాటించడం విషయం పై తనిఖీ చేశారు. తయారీ, స్టోర్ యూనిట్ల మధ్య దూరాలు కొలిచారు, మరియు అగ్ని ప్రమాద భద్రతా పరికరాలను, వాటి పని తీరును పరీక్షించారు.
మరో తనిఖీలో,  అనకాపల్లి డిఎస్పి శ్రీమతి శ్రావణి మామిడిపాలెంలోని ఎం/ఎస్ ద్వారక ఎంటర్‌ప్రైజెస్ మ్యాగజైన్‌ను సందర్శించారు. మ్యాగజైన్‌లో చెల్లుబాటులో ఉన్న PESO లైసెన్సులు, సరైన భద్రతా చర్యలు, మరియు భద్రమైన ప్రాంగణం ఉన్నట్లు తెలిపారు. స్టాక్ స్థాయిలు (నైట్రోజన్ మిక్చర్, డిటోనేటర్ ఫ్యూజ్, డిటోనేటర్లు, సేఫ్టీ ఫ్యూజ్ వైర్ ) అనుమతించబడిన పరిమాణంలో ఉన్నాయి అని తెలిపారు
6 లైటనింగ్ కండక్టర్లు పిడుగు ప్రమాదాన్ని తప్పించే సాధనాలు ఏర్పాటు చేసారని. అగ్ని ప్రమాద భద్రతా చర్యలు (వాటర్ పిట్స్, సాండ్ బకెట్స్, ఫైర్ ఎక్స్‌టింగుషర్స్) ఉన్నాయి అని. మ్యాగజైన్ ప్రదేశం  ఫెన్సింగ్, సెక్యూరిటీ పర్సనల్‌తో భద్రంగా ఉంది అని తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter