హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి... నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి... నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

08/November/2026 21:04    Share:   

నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
అనకాపల్లి | నూకాలమ్మ ఆర్చ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు, ప్రయాణికులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ జి. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని పోలీసులు తెలిపారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter