తవ్వేసారు.. వదిలేసారు!: వాటర్ పైప్‌లైన్ పనులతో ప్రజల అవస్థలు...
18/May/2026 15:01
Share:
గుంతల పూడ్చి రోడ్డు వేయండి, ప్రజా సంఘాలు అచ్చుతాపురం మండలం కేంద్రమైన స్టేట్ బ్యాంకు నుండి భోగాపురం వెళ్లే రోడ్డు లో వాటర్ పైప్ లైన్ కి రోడ్డు తవ్వడం జరిగింది తిరిగి రోడ్డు వేయకపోవడంతో గుంతలు గుంతగా ఉండడంవల్ల ప్రజలు నిత్యం ప్రమాదాలకి గురవుఅవుతూ ఉన్నారు ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు ఐద్వా మండల కన్వీనర్ రొంగలి లక్ష్మి మాట్లాడుతూ అచ్చుతాపురం మండల కేంద్రానికి ఈ రోడ్డు నుంచి ప్రయాణం మడుతూరు అప్పన్నపాలెం జంగులూరు అపార్ట్మెంట్స్ కాలేజీ రెండు స్కూలు విద్యార్థులు ప్రజలు కంపెనీ కార్మికులు వందలాదిమంది ప్రయాణం చేస్తూ వున్నారు గుంతలు కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రయాణికులకు గాయాలు అవుతున్నాయి కావున సంబంధించి అధికారులు స్పందించి రోడ్డు వేయాలని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు చుక్క నాగేశ్వరరావు పారిపల్లి సోమునాయుడు ఈ యశోద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.