ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా చిత్తశుద్ధితో పనిచేస్ఎతున్మ్మెనాము ఎమ్మెల్యే బడేటి చంటి
27/May/2026 08:26
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు - అన్నివర్గాల ప్రజలకు మరిన్ని ఆర్ధిక మేళ్ళు చేకూర్చే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా చిత్తశుద్ధితో పాటుపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి నుండి వినతులు స్వీకరించి, సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించి, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఒకపక్క మహిళలకు, మరోపక్క రైతులకు, ఇంకోపక్క యువతకు ఇలా అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇదేక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా సత్వర చర్యలు చేపట్టనున్నట్లు ఆయన భరోసానిచ్చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...