కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రెస్ ఫోరం నూతన కార్యవర్గ సభ్యులు
ఏలూరు:
నూతనంగా ఎన్నికైన ఏలూరు ప్రెస్ ఫోరం కార్యవర్గ సభ్యులు గురువారం సాయంత్రం ఏలూరు పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) పుట్టా మహేష్ కుమార్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ ఫోరం నూతన కార్యవర్గ సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి,శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం ప్రెస్ ఫోరం సభ్యులతో ఎంపీ కాసేపు ముచ్చటించారు. జర్నలిస్టుల సమస్యలు, స్థానిక అంశాలపై వారితో చర్చించారు.
ఎంపీని కలిసిన వారిలో ఏలూరు ప్రెస్ ఫోరం అధ్యక్షులు డి. రమణ (గోపికృష్ణ దినపత్రిక),జనరల్ సెక్రెటరీ పి. రవీంద్ర(TV5),ఉపాధ్యక్షులు బి. భాగ్యరాజు(Big TV), జాయింట్ సెక్రెటరీ వి.వాసు(10TV),గౌరవ అధ్యక్షులు రత్నగర్భ ప్రసాద్ (రత్నగర్భ పత్రిక),పి.ఆర్.ఓ ఎస్. సంజయ్ కుమార్(స్వతంత్ర TV),కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ (NTV),గౌస్(TV5) తదితరులు ఉన్నారు.