23న నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..!ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..!!

23న నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన..!ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్..!!

21/March/2026 17:51    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్
(సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి :
యలమంచిలి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో, ఈ నెల 23న నక్కపల్లిలో జరగబోయే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కూటమి పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, రాష్ట్ర రోడ్లు & భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన చర్యలపై చర్చించి, నాయకులకు సూచనలు చేసారు.
Breaking News

Subscribe our Newsletter