ఆంధ్రప్రదేశ్‌లో కిరోసిన్ పంపిణీ – మూడు నెలల రేషన్ ఒకేసారి..!

ఆంధ్రప్రదేశ్‌లో కిరోసిన్ పంపిణీ – మూడు నెలల రేషన్ ఒకేసారి..!

21/March/2026 17:54    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో కిరోసిన్ కొరతను నివారించేందుకు వచ్చే సోమవారం నుంచి రేషన్ ద్వారా లీటరు చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, కేంద్రం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్‌ను వినియోగదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విశాఖపట్నానికి రావాల్సిన గ్యాస్ నౌక ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న చేరాల్సిన నౌక 26న చేరనున్నట్లు సమాచారం. అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter