ప్రజలకు మెరుగైన రవాణా: విద్యుత్ బస్సులపై ఆర్టీసీకే పూర్తి బాధ్యతలు ఇవ్వాలి..

ప్రజలకు మెరుగైన రవాణా: విద్యుత్ బస్సులపై ఆర్టీసీకే పూర్తి బాధ్యతలు ఇవ్వాలి..

18/May/2026 21:04    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఆర్టీసీ ఉద్యోగుల సమశ్యలు పై విద్యుత్ బస్సుల అమలుతో(RTC ప్రైవేటీకరణ) భవిష్యతులో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ఇబ్బందులపై శ్రీయుత కలక్టర్,ఏలూరు జిల్లా వారికీ కె.రమేష్ కుమార్,చైర్మన్ ఏ.పి.జెఏసి.అమరావతి వారి ఆద్వర్యములో కలిసి representation ఇవ్వడము జరిగినది.ఈ కార్యక్రమములో బి.రాంబాబు రీజనల్ సెక్రటరీ, వై. శ్రీనివాస్,హోనేర్బుల్ ప్రసిడెంట్,ఏలూరు డిపో,టి.బాబు రావు,ప్రెసిడెంట్,ఏలూరు డిపో,డి. ఆంజనేయులు సెక్రెటరి,ఏలూరు డిపో.ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాము.అయితే ఈ విద్యుత్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థే స్వయంగా నిర్వహణ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందించడం జరుగుతుంది. కావున విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రవేటు ఆపరేటర్లకు అప్పగిస్తూ వారికీ ఆర్టీసీ డిపోలను ఖాళీ చేపించి వారికీ అప్పగించడాన్ని నిలుపుదల చేయాలనీ విజ్ఞప్తి చేస్తూ విద్యుత్ బస్సులన్ని ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని కోరినారు. 
2012 నుండి ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేనందున ప్రస్తుతం పిటిడిలో ఉన్న ఉద్యోగులు సంఖ్య, చాల తక్కువగా ఉన్నందున స్త్రీ శక్తి పథకం అమలు తరువాత ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న కారణంగా ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే వివిధ కేటగిరీలలో 10 వేల మంది సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
రిటైర్డ్/ మరణించిన పిటిడి ఉద్యోగులకు ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు..
Breaking News

Subscribe our Newsletter