పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలి ,సిపిఎం

పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలి ,సిపిఎం

08/March/2026 16:25    Share:   

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నిన్నటి నుండి వంటగ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు వాణిజ్య సిలిండర్ పై 115 పెంపును నిరసిస్తూ అచ్చుతాపురం లో ఖాళీ సిలిండర్ పెట్టి పెంచిన వంటగ్యాస్ ధరలు తగ్గించాలని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము, సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, ప్రజలు నడ్డి విరిచే విధంగా వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలకు తీవ్ర బారాలు వేసిందని ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ కలిపి చేస్తున్న యుద్ధం వలన ప్రజలపై భారం వేసిందని ఇరాన్ పై యుద్ధం వద్దని అమెరికా పై భారతదేశం ఒత్తిడి తేవాలని వంట గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి, చిల్లర వర్తకులు తీవ్ర అబ్బందులు పడతారని తక్షణమే వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఒకరు కాదు ముగ్గురు పిల్లల కణాలని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఒకరిద్దరు పిల్లలతోనే కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే నిత్యవసర వస్తువులు ధరలు ఉపేత్తంగా పెరిగాయని కార్మికుల ఉద్యోగులు వేతనాలు మాత్రం పెంచడం లేదని వెంటనే ధరలు తగ్గించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కెవి సూర్యప్రభ, కే రామ సదాశివరావు ,ఐద్వా నాయకులు నారాయణమ్మ, ఆర్ లక్ష్మీ కాసులమ్మ, కే సోమనాయుడు, కాకి రాజు సువా తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter