2570వ బుద్ధ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

2570వ బుద్ధ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలకు ఆహ్వానం

23/April/2026 18:00    Share:   

అనకాపల్లి, ఏప్రిల్ 2026 – ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన గౌతమ బుద్ధుని 2570వ జయంతి సందర్భంగా స్థానిక సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూషణము ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.ఈ పోటీలు జిల్లాలోని 1 నుండి 10వ తరగతి వరకు గల అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించనున్నారు. అంశం – "గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర". పోటీకి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.పాల్గొనే విద్యార్థులు తెలుగు భాషలో నాలుగు అరటావు పేజీలకు మించకుండా స్వదస్తూరితో వ్యాసం వ్రాయాలి. ఈ వ్యాసాలను స్వయంగా గానీ, ఏదేని పోస్టు ద్వారా గానీ 29.04.2026, బుధవారం సాయంత్రం లోగా కింది చిరునామాకు చేరవేయాలి.

బహుమతులు – విభాగాలు

  • జూనియర్స్: 1 నుండి 5వ తరగతి వరకు

  • సీనియర్స్: 6 నుండి 10వ తరగతి వరకు

  • రెండు విభాగాల్లో విడివిడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు రెండు ప్రత్యేక బహుమతులు ఉంటాయి.

విజేతలకు 2026, మే 1వ తేదీ, భగవాన్ బుద్ధుని 2570వ జయంతి నాడు గౌరవ అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుంది.వ్యాసంతోపాటు విద్యార్థులు తమ పాఠశాల చిరునామా, ఫోన్ నంబర్ తప్పనిసరిగా వ్రాయాలి. అన్ని వివరాలకు సంస్థ ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.


వ్యాసరచనలు పంపించాల్సిన చిరునామా:

బల్లా నాగభూషణం, బి.ఏ.
(భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత)
డోర్ నంబరు: 10.01.88, పిల్లావారి వీధి, చేపల బజారు దగ్గర్లో,
అనకాపల్లి – 531001
అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్
వ్యవస్థాపక అధ్యక్షులు – సిద్ధార్థ సోషల్ సర్వీస్ & కల్చరల్ అసోసియేషన్
సెల్: 8977020615, 9493256300


ఇట్లు,
బల్లా నాగభూషణం
అనకాపల్లి

Breaking News

Subscribe our Newsletter