అనకాపల్లి లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి వేడుకలు..

అనకాపల్లి లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి వేడుకలు..

16/March/2026 12:26    Share:   

అనకాపల్లి సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యములో మెయిన్ రోడ్ లోగల పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి వేడుకలు.. 
ఈ దినం ఉదయము స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్& కల్చరల్ అసోసియేషన్,అధ్యక్షులు 
బల్లానాగభూషణము ఆధ్వర్యములో స్థానిక మెయిన్ రోడ్ లో గల శ్రీ పొట్టి శ్రీరాము
లు గారి విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి వేడుకలను ఘనముగా నిర్వహించారు.ముందుగా శ్రీ పొట్టి శ్రీ రాములు గారి విగ్రహానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బల్లానాగభూషణము పూల మాల వేసి ఘనంగా నివాళి లర్పించారు.అనంతరం బల్లా నాగభూషణము మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు గాంధేయవాదిగా ఆనాటి స్వాతంత్ర పోరాటాల లో 
చురుకుగా పాల్గొని మహాత్మాగాంధీ గారి ప్రియ శిష్యునిగా ఉంటూ జైలు శిక్షలను అనుభవించిన గొప్ప దేశభక్తులని అలాగే తెలుగు వారందరికీ ఒక ప్రత్యేక రాష్ట్రం గావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి 
రాజధాని మద్రాస్ నగరంలో 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేయడం వలన మన తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవ్వడం వారి త్యాగ ఫలితమే నని అటువంటి మహనీయ వ్యక్తి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారని, అటువంటి దేశభక్తులు మహనీయ వ్యక్తి ఐన పొట్టి శ్రీరాములు గారికి భారత రత్న పురస్కారాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ 
జయంతి సందర్భముగా భారత ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతిని ప్రభుత్వ శలవు దినంగా ప్రకటించాలని, వారిజీవిత చరిత్ర ను రాష్ట్ర ప్రభు
త్వము పాఠ్య పుస్తకాలలో చేర్చి విద్యార్థులలో పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని గూర్చి తెలియ జేసి 
విద్యార్థులలో దేశభక్తిని  పెంపొందించాలని అన్నారు.
ఈ కార్యక్రమములో సిద్దార్ధ అసోసియేషన్ అధ్యక్షులు బల్లానాగభూషణము,సహాయ కార్యదర్శి రొబ్బిమల్లేశ్వరరావు,కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకట రమణమూర్తి,కాపారపు సత్యనారాయణ,కె.నాగరాజు,వికలాంగుల హక్కు పరిరక్షణ సమితి అధ్యక్షుడు బుగిడి నూకప్పారావు,వాసవీ క్లబ్ సభ్యులు పప్పుల రమణాజీ తదితరులు పాల్గొన్నారు.
*
Breaking News

Subscribe our Newsletter