ఈనెలాఖవరకు తీవ్రమైన ఎండలు 45-47 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం
22/May/2026 19:40
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఈనెలాఖవరకు తీవ్రమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా ఏలూరు మండలంలోని ప్రతీ స్వర్ణ గ్రామ సచివాలయ పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని ఏలూరు తహసీల్దార్ కె. గాయత్రీదేవి చెప్పారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఏలూరు మండల పరిధిలో ఎండ తీవ్రతపై గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించి,అత్యవసర పరిస్థితులలో తప్ప ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని,ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నామన్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.వేడిగాలులు గురైన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించేలా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు.