కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP)గారి ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులు మధ్య మరింత సమన్వయం పెంపొందించేటకై రూపొందించబడిన జగన్ 2.0 సూపర్ యాప్(Jagan 2.0 Super App)ను ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్(JP)గారు, ఆవిష్కరించారు.* (JP)గారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమాచారం మార్పిడి వేగవంతం చేయాలని ఉద్దేశంతో ఈ యాప్ రూపొందించబడిందని, ఈ యాప్ ద్వారా ప్రతీ కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుందని, సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసే పోస్టులు తొలగించడం, వాటిపై కేసులు నమోదు అవుతున్న తరుణంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలకు ఒక సమగ్ర డిజిటల్ వేదిక అవసరమని భావించి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్(Jagan 2.0 Super App)ను తీసుకువచ్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా,నగర, అనుబంధ విభాగాలు,సోషల్ మీడియా విభాగ నాయకులు పాల్గొన్నారు.