C.I.T.U. కార్యాలయంలో ప్రజా ఆరోగ్య వేదిక నిర్వహణలో ఉచిత మెడికల్ క్యాంపు..
12/July/2026 22:34
Share:
అనకాపల్లి ప్రజా ఆరోగ్య వేదిక వారి నిర్వహణలో అనకాపల్లి C.I.T.U. కార్యాలయంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులో బిపి, షుగర్, ఫిట్స్, పక్షవాతం, నరాల సంబంధిత వ్యాధులకు లండన్ నుంచి విచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ శ్రీ బుద్ధ సాయి సందీప్ గారు, రిటైర్డ్ డిప్యూటీ సివిల్ సర్జన్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి వైద్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ ధర్మాల సాంబమూర్తి గారు, గౌరవనీయులు డాక్టర్ శ్రీ మీనేంద్ర కుమార్ గారు ఈరోజు క్యాంపులో తమ అమూల్యమైన సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది పేషెంట్లు సేవలు పొందారు. అనకాపల్లి ప్రజా ఆరోగ్య వేదిక వారు ప్రతి రెండు నెలలకు రెండవ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంపు 10 సంవత్సరాలు అయిన సందర్భంగా..... 10 సంవత్సరముల నుండి తమ అమూల్యమైన సేవలందిస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీ ధర్మాల సాంబమూర్తి గారిని ప్రజా ఆరోగ్య వేదిక కమిటీ గౌరవంగా సత్కరిస్తూ.... తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకున్నారు. అలాగే తమ అమూల్యమైన సేవలు అందించిన డాక్టర్ సాయి సందీప్ గారిని, డాక్టర్ మీనేంద్ర కుమార్ గారిని ప్రజా ఆరోగ్య వేదిక బృందం గౌరవంగా సత్కరించుకోవడం జరిగినది. ప్రజా ఆరోగ్య వేదిక సేవలను రాష్ట్రమంతా విస్తృత పరుస్తున్న ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారిని గౌరవంగా సత్కరించుకోవడం జరిగినది. ఈ వైద్య శిబిరాన్ని 10 సంవత్సరముల నుండి నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆరోగ్య వేదిక కన్వీనర్ గౌరవనీయులు శ్రీ మల్ల చంద్రశేఖర రావు గారిని వైద్యులు అభినందిస్తూ చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక సభ్యులు కొల్లూరు శ్రీరామ్ మూర్తి గారు, కొణతాల త్రినాథ్ , కొణతుల రాంబాబు గారు, జంప రమేష్ బాబు గారు, మల్ల అప్పలనాయుడు గారు, కొయిలాడ ప్రసన్నకుమార్ గారు, సూరిశెట్టి రాజుగారు, తేలయ్య బాబు గారు, పెంటకోట శ్రీను గారు, C.I.T.U నాయకులు ఈశ్వరరావు గారు, రాజుగారు, శ్రీరామ్ గారు, బుగిడి నూక అప్పారావు గారు, పత్రికా విలేకరి రమేష్ గారు, ఆర్టీసీ ఉద్యోగులు పరమేశ్వర రావు గారు తదితరులు పాల్గొన్నారు.పేషెంట్లు మాట్లాడుతూ తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నటువంటి వైద్య బృందానికి, ప్రజా ఆరోగ్య వేదిక కమిటీ వారికి మరియు ప్రజా ఆరోగ్య వేదిక వారి సౌజన్యంతో తమ వంతు సేవగా షుగర్ టెస్ట్ పరీక్షలు అది తక్కువ ధరకే నిర్వహిస్తున్నటువంటి గణేష్ స్కానింగ్ సెంటర్ మరియు సన్ మెడికల్ సెంటర్ వారికి పేషెంట్లు ప్రత్యేక అభివందనములు తెలియజేసుకున్నారు.