అనకాపల్లి సమస్యలపై జీవీఎంసీ కమిషనర్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతి..

అనకాపల్లి సమస్యలపై జీవీఎంసీ కమిషనర్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతి..

23/July/2026 15:51    Share:   

అనకాపల్లి జిల్లా కన్వీనర్ శ్రీ కొణతాల హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేశారు.జిల్లా ఏర్పాటైనప్పటికీ జీవీఎంసీని అనకాపల్లి జిల్లాలో విలీనం చేయకపోవడం వల్ల స్థానిక సమస్యలు పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ ఆదాయం పెరుగుతున్నా, అనకాపల్లి పట్టణంలో అభివృద్ధి కనబడకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు.విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ గారు ప్రతినెల అనకాపల్లిలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలను తెలుసుకోవాలని, తద్వారా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్ గారు ఈ విషయాన్ని విశాఖపట్నం కమిషనర్ గారికి తెలియజేసి, ప్రతి నెలలో ఒక తేదీని నిర్ణయించి అన్ని రాజకీయ పార్టీలను పిలిపించాలని వారు కోరారు. ఈ విధంగా సమస్యలు సమన్వయంతో పరిష్కారం అవుతాయని, అనకాపల్లి అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 
Breaking News

Subscribe our Newsletter