ఉత్తరాంధ్ర హక్కుల పోరాట యోధుడు కొణతాల రామకృష్ణ: పలువురి ప్రశంసలు..

ఉత్తరాంధ్ర హక్కుల పోరాట యోధుడు కొణతాల రామకృష్ణ: పలువురి ప్రశంసలు..

04/June/2026 16:45    Share:   

అనకాపల్లి:
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ

పదవులు శాశ్వతం కావు... ప్రజల కోసం చేసిన సేవే చరిత్రలో నిలిచిపోతుంది అనే నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జీవించిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర ప్రజల హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం గళమెత్తిన నిఖార్సైన ప్రజానాయకుడని పలువురు కొనియాడారు.
కొణతాల రామకృష్ణ తన రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన సాగించిన పోరాటాలు స్పూర్తిదాయకమైనవి. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ఆయన నిరంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు:
  • విశాఖపట్నం రైల్వే జోన్ సాధన,ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్,పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయడం,విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం,విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు,రాయలసీమ అభివృద్ధి కోసం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. 
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం ప్రత్యేక ఉద్యమం:
ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబాటుతనాన్ని పూర్తిగా తొలగించాలనే గట్టి సంకల్పంతో ఆయన పనిచేశారు. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించడంతో పాటు పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా "ఉత్తరాంధ్ర సుజల స్రవంతి" ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని నమ్మిన ఆయన, అనేక వేదికలపై ఈ డిమాండ్‌ను బలంగా వినిపించి పాలకుల దృష్టిని ఆకర్షించారు.ప్రజా సమస్యల పట్ల అపారమైన తపన, అంకితభావం కలిగిన నాయకుడిగా కొణతాల రామకృష్ణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో హుందాతనం, అందరినీ కలుపుకుని వెళ్లే విశాల స్వభావం, స్నేహపూర్వక వైఖరి, చమత్కారమైన హాస్య చతురత ఆయన వ్యక్తిత్వానికి ఆభరణాలుగా నిలిచాయి. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారం కోసం అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం ఆయన రాజకీయ శైలికి నిదర్శనం. ప్రజల కోసం ఆయన చేసిన నిరంతర సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

 
Breaking News

Subscribe our Newsletter