ఏటికొప్పాకలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా – యువతలో నూతన స్ఫూర్తి..!!

ఏటికొప్పాకలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా – యువతలో నూతన స్ఫూర్తి..!!

14/April/2026 16:17    Share:   

క్రైమ్ అనాల్సిస్ స్పెషల్ రిపోర్టర్, కే ఆనంద్, ఏటికొప్పాక :
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న యువత, గ్రామ పెద్దలు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాధాన్యతపై ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో ర్యాలీ నిర్వహించి నినాదాలతో కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు. అనంతరం భారీ స్థాయిలో అన్నదానం నిర్వహించి గ్రామస్తులకు భోజనాలు వడ్డించారు.ఈ వేడుకలు యువతలో చైతన్యం పెంచేలా జరిగాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.
Breaking News

Subscribe our Newsletter