సమరసత సేవ ఫౌండేషన్ పలు గ్రామాల్లో చేస్తున్న కార్యక్రమలు... యలమంచిలి సమరసత సేవ ఫౌండేషన్ గ్రామాల్లో చేస్తున్న పలు కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అని రాంబిల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లాలం భరత్ అన్నారు. శుక్రవారం లాలంకోడూరులో గల తన నివాసంలో మండల సహ కన్వీనర్ చింతకాయల గగన్, ధర్మ ప్రచారకు కలిసి ఎస్ఎస్ఎఫ్ చేస్తున్న పనులను వివరించి ధర్మ రక్షా నిధి వ్రాయించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ధర్మం కోసం పనిచేస్తున్న ఈ ఫౌండేషన్ కు ఏ సహకారం కావాలన్నా తన వంతు సహాయం చేస్తానన్నారు. వీరితోపాటు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చిట్టిబాబు, సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ చింతకాయల అమ్మోరియ్య పాల్గొన్నారు