ఏలూరు జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక. కలెక్టర్ కె.వెట్రిసెల్వి ..
10/March/2026 07:17
Share:
పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలి* కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు: దరఖాస్తులోని అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ధరఖాస్తులు పరిష్కారంలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 271. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ... ఏలూరు, జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, తదితరులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిజిఆర్ యస్ లో అందిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని , కావున అధికారులు ధరఖాస్తులో తెలియజేసిన విషయాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. భూ సమస్యలు రెవిన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు...