వైసిపి ప్రజలను తప్పుదోవ పట్టించే నిరసనలు మానుకోవాలి.. ప్రస్తుతం ధరలు పెంచింది రాష్ట్రం కాదు కేంద్రమే..

వైసిపి ప్రజలను తప్పుదోవ పట్టించే నిరసనలు మానుకోవాలి.. ప్రస్తుతం ధరలు పెంచింది రాష్ట్రం కాదు కేంద్రమే..

20/May/2026 07:17    Share:   

* వైసిపి ప్రజలను తప్పుదోవ పట్టించే నిరసనలు మానుకోవాలి..
* వైసీపీ నిరసనలు ప్రజా సమస్యల కోసం కావు..
* రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వారి తాపత్రయం..
* గత వైసిపి ప్రభుత్వం లో జగన్ రెడ్డి హయాంలోనే ఏపీలో పొరుగు రాష్ట్రాల కంటే అధిక ధరలు..
* ప్రస్తుతం ధరలు పెంచింది రాష్ట్రం కాదు కేంద్రమే..
* మీడియా సమావేశంలో ఆర్టీసీ జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఘాటు విమర్శలు..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
వైసిపి నాయకులు ఏ సమయంలో ఏ అంశంపై నిరసనలు తెలియజేయాలో కనీస రాజకీయ అవగాహన కూడా కోల్పోయారని జనసేన ఏలూరు ఇన్చార్జిరెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. మంగళవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్న తొలి రెండేళ్లలోనే పెట్రోల్ డీజిల్ ధరలపై సుమారు 31 రూపాయి వరకు భారం పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపారని ఆరోపించారు. అలాగే రోడ్డు సెస్ పేరుతో లీటరుకు రూపాయి అదనపు భారం విధించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ పై పన్నులు తగ్గించి ప్రజలకు ఊరటను కల్పించినప్పటికీ, అప్పటి ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం తగ్గించే చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు ధరలను తగ్గించిన సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా తగ్గించలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఇంధన ధరలు, పెరుగుదల అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ధరలు పెరగడం సరఫరా వ్యవస్థ పై ప్రభావం పడడం వల్లే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం తగదని, ప్రజా సమస్యల పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడడం సరికాదని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఆందోళన చేపడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రాష్ట్రంలో వైసిపి చేపడుతున్న నిరసనలు ప్రజాప్రయోజనాలు కోసం కాకుండా, వైసిపి పార్టీ రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు ధరల పెరుగుదలపై నిరసనలకు పిలుపునివ్వడం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అప్పలనాయుడు విమర్శించారు. 2019 నుండి 2024 మధ్యకాలంలో పలుమార్లు ఇంధన ధరలు పెరిగినప్పుడు స్పందించని వైసీపీ కీ, ఇప్పుడు ధరల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో చోటు చేసుకున్న ధరల మార్పులు రాష్ట్ర ప్రభుత్వ కారణాల వల్ల కాకుండా అంతర్జాతీయ యుద్ద పరిస్థితులు ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావంతో కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ఫలితము అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధంలేని అంశాలపై ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రకటించడం, వైసిపి రాజకీయ దిగజారుడుతనాన్ని సూచిస్తుందని ఆరోపించారు. ప్రజా మద్దతు కోల్పోయిన నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత కోసం అనవసర ఆందోళన చేపట్టాలని ప్రయత్నించడం, ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో, రాష్ట్రాన్ని స్థిరంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం దూరదృష్టితో పనిచేస్తుందని అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ సమయంలో ఆధార రహిత ఆరోపణలు, రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు మానుకోవాలని వైసిపి నాయకత్వానికి సూచించారు. ప్రస్తుతం ధరల పెంపు బాధాకరమైనప్పటికీ గతంలో ప్రజలపై అధిక భారం మోపిన వైసిపి నేతలు, ఇప్పుడు ధర్నాలు చేయడం సిగ్గుచేటని, సమంజసం కాదని, వైసిపి నాయకులకు నైతిక హక్కు లేదని రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ,రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, బొత్స మధు, రెడ్డి గౌరీశంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి, కొండల ప్రసాద్, కన్న ప్రసాద్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter