తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం
28/February/2026 07:04
Share:
యలమంచిలి: కూటమి ప్రభుత్వంతోనే ఎనలేని అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని మాజీ ఎంపీ పప్పల చలపతిరావు అన్నారు. శుక్రవారం పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ లో మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పప్పల చలపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రేపు యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో బ్లూజెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయుచున్నారని అన్నారు. నారా లోకేష్ పర్యటనను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్లి శివన్నారాయణ మూర్తి, మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గెంజి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొర్లి బాబురావు, మజ్జి రామకృష్ణ, కరణం రవి కుమార్, గుప్తా తదితరులు పాల్గొన్నారు.