రోడ్డు భద్రతే ధ్యేయం..! రాంబిల్లి లో 25 సౌర వీధి దీపాల ఏర్పాటు..! క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వినూత్న సామాజిక భద్రతా కార్యక్రమం చేపట్టారు.రాత్రి వేళల్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంకటాపురం జంక్షన్ నుండి NAOB వరకు ప్రధాన రహదారిపై 25 సౌర వీధి దీపాలను (Solar Street Lights) ఏర్పాటు చేశారు.ప్రజల విన్నపాన్ని గౌరవిస్తూ Saint-Gobain సంస్థ సామాజిక బాధ్యత (CSR) కింద ఈ దీపాలను అందించింది.చీకటిగా ఉండే మలుపులు, జంక్షన్ల వద్ద వెలుతురు పెరగడం వల్ల వాహనదారులు మరియు పాదచారులకు స్పష్టమైన దృశ్యం లభించి ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రాంబిల్లి ఇన్‌స్పెక్టర్ నర్సింగరావు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో Saint-Gobain ప్రతినిధులు శివ కుమార్ మురుగేషన్ (ప్లాంట్ హెడ్) మరియు శివ ప్రసాద్ (హెచ్‌ఆర్ మేనేజర్) పాల్గొన్నారు.పరిశ్రమల సహకారంతో ప్రజల భద్రత కోసం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పోలీసులు తెలిపారు. "ప్రజల ప్రాణ రక్షణే మా మొదటి ప్రాధాన్యత. చీకటి ప్రాంతాల్లో వెలుతురు కల్పించడం ద్వారా రాత్రి ప్రయాణాలను మరింత సురక్షితం చేస్తున్నాం." — రాంబిల్లి పోలీస్ శాఖ ఈ వినూత్న చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, పోలీస్ శాఖకు మరియు సహకరించిన సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.