ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ.

ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యం: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ.

28/April/2026 06:58    Share:   

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రజల సమస్య ల పరిష్కారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాల యంలో పబ్లిక్ గ్రీవెన్స్ ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో నిర్వహించి నారు.*
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన,పార దర్శ కంగా పరిష్కరించ డమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమ వారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక' కార్య క్రమం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు,  ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జి ముని రాజా గారి తో కలిసి ఫిర్యాదు దారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమం పూర్తిగా పేపర్ లెస్ పద్ధతిలో, పారదర్శ కమైన ఆన్‌లైన్ విధానంలో మొత్తం 49 ఫిర్యా దులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సం బంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పీ స్వయంగా ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. సదరు ఫిర్యా దులపై చట్టప్రకారం తక్షణమే విచారణ చేపట్టి, నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారు లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మరిన్ని వెసులు బాటులను ఎస్పీ గారు వివరించారు డబ్బు, సమయం వృథా చేసుకోకుండా నేరుగా సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు.ఫిర్యాదులు చేయా లనుకునే వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.ప్రజలు చేసిన ఫిర్యాదుల స్థితిగతు లను  తెలుసు కోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అని జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు.ఫిర్యాదుల పరిష్కార వేదిక దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు సత్యసాయి సంఘం వారు భోజన ఏర్పాట్లను చేసినారు
Breaking News

Subscribe our Newsletter