కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ రిపోర్టర్ యలమంచిలి /మండలంలోని సమృద్ధిగా అన్ని రైతు సేవా కేంద్రంలో వరి విత్తనములు 956 క్వింటాళ్లు ఆర్ జి ఎల్.- 2537 బిపిటి. 52 04. ఎం టి యు. 1318, ఎం టి యు.12 24 , ఎం టి యు.1064 ఆర్జిఎల్.- 73 10 బిపిటి.2846 రకములను అన్ని రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి మోహన రావు ప్రకటన ప్రకటన ద్వారా తెలియజేశారు.ముందుగా అన్ని రైతు సేవా కేంద్రంలో నేల తల్లిని రక్షించుకోవాలని ముందుగా జనుమ మరియు జీలుగా వంటి పచ్చిరొట్ట విత్తనములను అమ్మకాలు గత రెండు వారాల నుంచి రైతులకు సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండడం జరిగినది, పాడి పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని గడ్డికి ఎరువులు కావలసిన వాళ్లు తక్కువ మోతాదులో వేసుకోవాల్సిందిగా లక్కవరం పిఎసిఎస్ సొసైటీ రైతు సేవ కేంద్ర పరిధిలో మరియు డీలర్ వద్ద 80 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతు సోదరులు కావలసిన వాళ్లు ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పొందగలరని తెలియజేసుకుంటున్నాము.