యలమంచిలి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవములు..!

యలమంచిలి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవములు..!

16/March/2026 19:13    Share:   


యలమంచిలి/దిమిలి 
క్రైమ్ అనాల్సిస్ టివిఎస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్)  యలమంచిలి :
అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని దిమిలి రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు  విగ్రహం వద్ద ఆయన 125వ జయంతి ఉత్సవాలు స్థానిక ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బి. రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా పాల్గొన్నారు. అలాగే ఆర్య వైశ్య సంఘం పెద్దలు రంగా చిన వెంకట స్వామి, ఆర్య వైశ్య సంఘం కార్యదర్శి కట్టా సత్యనారాయణ, కట్టుమురి బసవరాజు, కట్టా పెద్దప్ప, కుసుమంచి జోగిరాజు గుప్తా పాల్గొన్నారు.ఇక వాసవి క్లబ్ సభ్యులు, వాసవి వనిత క్లబ్ సభ్యులు, చెక్క శ్యామ్, డా. పిళ్లా త్రినాధ్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్స్ మరియు మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు.
Breaking News

Subscribe our Newsletter