బీజేపీ శిక్షణా తరగతులు విజయవంతంగా ముగింపు..!

బీజేపీ శిక్షణా తరగతులు విజయవంతంగా ముగింపు..!

30/March/2026 21:46    Share:   

క్రైమ్ అనాలసిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
యలమంచిలి పట్టణ పరిధిలోని తులసి కళ్యాణ మండపంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శిక్షణా తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పిళ్లా రమా కుమారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు పరమేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.పిళ్లా రమా కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం డిజిటల్ ఇండియాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేకుండా పేదలు మరియు మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పార్టీ అభివృద్ధికి సహకరించాలని కార్యకర్తలకు సూచించారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముగిశాయి.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షురాలు సయ్యద్ బీబీతో పాటు ఆడారి చిన్న, ఆడారి వెంకట్, సుందరపు బాబ్జి, మల్ల కొండబాబు, పప్పు ఈశ్వరరావు, పిట్టా దాసుబాబు, పడాల సూరిబాబు, జానకిరామ్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter