ఏలూరు న్యాయవాద ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా 71 ఓట్లతో నిమ్మల జ్యోతి కుమార్ ఘన విజయం..

ఏలూరు న్యాయవాద ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ గా 71 ఓట్లతో నిమ్మల జ్యోతి కుమార్ ఘన విజయం..

28/March/2026 06:36    Share:   

ఏలూరు జనసేన కార్యాలయం లో సత్కరించిన రెడ్డి అప్పల నాయుడు గారు..తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన నిమ్మల జ్యోతి కుమార్..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
ఏలూరు, మార్చి 27:- ఏలూరు జిల్లా కోర్టులో జరిగిన ఏలూరు న్యాయవాద సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) గా జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ గారు 71 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈరోజు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిమ్మల జ్యోతి కుమార్ గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నిమ్మల జ్యోతి కుమార్ మాట్లాడుతూ నా ఈ విజయానికి సహకరించిన ఏలూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు, తనతోటి సహచర న్యాయవాదులకు కృతజ్ఞతలు, అలాగే ఈ విజయంలో సహకరించిన అబ్బినేని విజయ్ గారికి టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు.  అలాగే ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారికి ఏలూరు జనసైనికులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter