వాడనరసాపురం ఎం.పి.యు.పి పాఠశాలలో..! ఉచిత కంటి వైద్య శిబిరం..!!

వాడనరసాపురం ఎం.పి.యు.పి పాఠశాలలో..! ఉచిత కంటి వైద్య శిబిరం..!!

21/April/2026 19:59    Share:   

క్రైమ్ అనాల్సిస్ – టీవీఎస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడనరసాపురం గ్రామంలోని ఎం.పి.యు.పి పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. సార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్ చింతకాయల ఎర్రయ్య సహకారంతో, శంకర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ శిబిరంలో ఆప్తమాలజిస్ట్ డాక్టర్  సత్యవతి సుమారు 70 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించి, శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు.
యస్.ఏ.ఆర్.డి.యస్ జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. మంగమ్మ మాట్లాడుతూ, మత్స్యకార గ్రామాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి కంటి సమస్యలు అధికంగా వస్తాయని, అందుకే ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారే రామారావు, మాజీ సర్పంచ్ చింతకాయల ఎర్రయ్య, శంకర్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సతీష్, పాఠశాల హెచ్.ఎం సావిత్రి, ఎస్.ఎం.సి చైర్మన్ వాసపిల్లి తేజ, ఆర్.వై.డి.యస్ ప్రతినిధి సూరాడ నూకరాజు, చింతకాయల కోదండరావు, బాలపరమేశ్వరరావు, చోడిపిళ్లి మంగరాజు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కారే నాని, టీడీపీ గ్రామ అధ్యక్షులు వాసపిల్లి సూరి, కారే రాముడు, గగన్, మల్లి, మైలపిల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter