కశింకోట శ్రీ గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న -రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు. కశింకోట మండలం, కశింకోట శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్బంగా స్వామి వారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి, సత్కరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి పార్టీల శ్రేణులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.