ఏలూరు జిల్లా పోలీసులు నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెతించేలాగా కొత్త ప్రయత్నం.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన పోస్టర్ వైరల్ అవుతోంది. పాత నేరస్థుల ఫోటోలతో "నేను ఎవరో మీకు తెలుసా?" అంటూ రూపొందించిన ఈ పోస్టర్ ప్రజల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పోస్టర్లు ప్రదర్శించడం వల్ల నేరస్థుల గుర్తింపు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల నేరాలు జరగకముందే ప్రజలు అప్రమత్తం కావడానికి, అనుమానితులను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేరస్థుల పరువు బహిరంగంగా దెబ్బతింటుందనే భయం కూడా నేర ప్రవృత్తిని అరికట్టే అంశంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
నేర నివారణకు కొత్త మార్గం: బహిరంగ పరువు నష్టం?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టర్ నేర నివారణపై కొత్త చర్చకు దారితీసింది. నేరస్థుల పాత ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించడం వల్ల ప్రజల్లో అప్రమత్తత పెరగడమే కాకుండా, నేరస్థుల్లో పరువు పోతుందనే భయం కూడా పెరుగుతుంది. ఇది నేర ప్రవృత్తిని తగ్గించే శక్తివంతమైన మానసిక ఆయుధం కావచ్చు. ఒక వ్యక్తి తాను చేసిన తప్పుకు జైలు శిక్ష అనుభవించడమే కాకుండా, సమాజంలో తన ముఖం బహిర్గతమవుతుందనే భయం అతన్ని మళ్లీ నేరం చేయకుండా ఆపగలదు. ఇది కేవలం శిక్ష కంటే మించిన నివారణ చర్యగా మారవచ్చు.