అనకాపల్లి 82 వ వార్డు కార్పొరేటర్ కు అభినందనల వెల్లువ !

అనకాపల్లి 82 వ వార్డు కార్పొరేటర్ కు అభినందనల వెల్లువ !

13/March/2026 15:44    Share:   

వైఎస్సార్సీపీ నేతల ఆత్మీయ సమావేశంలో సునీత జానకిరామరాజు కు అభినందనల వెల్లువ !
క్రైమ్ అనాలసిస్:A. Srinivasa Rao,అనకాపల్లి.జిల్లా ఇన్చార్జి,
వైఎస్సార్సీపీ నేతల ఆత్మీయ సమావేశంలో అభినందనల వెల్లువ గత ఐదేళ్లలో వార్డులో జరిగిన కనీవినీ ఎరుగని అభివృద్ధి పనులే శ్రీమతి మందపాటి సునీత జానకిరామరాజును మళ్లీ విజయపథంలో నడిపిస్తాయని వైఎస్సార్సీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సుమారు రూ.15 కోట్ల నిధులతో వార్డులో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలంతా ఆమె వైపే ఉన్నారని పేర్కొన్నారు. సునీత జానకిరామరాజు విజయకాంక్షను తెలియజేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాయి.
వార్డు పరిధిలో గత ఐదేళ్లలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. నూతన రోడ్ల నిర్మాణం, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, స్థానికుల ఆహ్లాదం కోసం శాంతి పార్క్ సుందరీకరణ, క్రీడాకారుల కోసం ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి, అలాగే యువత కోసం ప్రత్యేకంగా వాలీబాల్ కోర్టు నిర్మాణం వంటి ఎన్నో కీలక పనులను విజయవంతంగా పూర్తి చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడం వల్లే ఆమె ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పలువురు కొనియాడారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున శ్రీమతి మందపాటి సునీత జానకిరామరాజు మరోసారి భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
పశ్చిమ గోదావరి కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్ మలసాల భరత్ కుమార్,మాడుగుల నియోజకవర్గ ఇంచార్జ్ ధర్మ శ్రీ,,విశాఖ మాజీ మేయర్ వెంకట కుమారి,ఎంపీ సత్యవతి,సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్, బొడ్డేడ ప్రసాద్,81వ వార్డు ఇంచార్జ్ కే ఏమ్ నాయుడు,
84వ వార్డు ఇంచార్జ్ కోరుకొండ రాఘవ,83వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ప్రసన్న జాజుల రమేష్, మల్ల బుల్లిబాబు .
సునీత జానకిరామరాజు నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే ఆమె గెలుపు చారిత్రక అవసరమని ఈ సందర్భంగా నాయకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు.
Breaking News

Subscribe our Newsletter