ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పనితీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రశంసల జల్లు
16/March/2026 21:20
Share:
ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి పనితీరును కొనియాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు మార్చి 16 (ca news) Sudheer ddl దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి అంటే అందుకు కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి చూపిన చొరవే కారణం" అంటూ ప్రశంసల జల్లు కురిపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ . పెదవేగి మండలం పెదవేగిలో సోమవారం జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు మరియు రైతన్న మీకోసం కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పనితీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సభాముఖంగా ప్రశంసల జల్లు కురిపించారు. దెందులూరు నియోజకవర్గం లోని పెదపాడు, పెదవేగి, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల్లోని అనేక గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఎన్నో రహదారులతో పాటు గ్రామాల్లోని అంతర్గత రోడ్ల నిర్మాణాలు సైతం చేపట్టడం జరిగిందని, తాజాగా మరో రూ.20 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందనీ, అందుకు తమ గ్రామాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమస్యలైన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన మరుక్షణమే వాటిపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించేలా కలెక్టర్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని, జూన్ 2024 లో ఏలూరు జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశలో పయనింపచేసేలా ప్రణాళికలు రచించడంతోపాటు వాటిని అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, జిల్లా అధికార యంత్రాంగానికి సిబ్బందికి వారొక స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, మరోవైపు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అటు పోలవరం నుంచి ఇటు ఉప్పుటేరు వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి రక్షణ చర్యలు చేపట్టడం, అక్కడి బాధితులకు భరోసా ఇవ్వడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించడానికి ఆమె చూపిన చొరవ ఎంతో అభినందనీయమని, వారి సహకారంతో సుమారుగా ఈ 20 నెలల కాలంలో దెందులూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, ఒక్క దెందులూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ చొరవతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం జరుగుతుందని, ఇందుకు కూటమి పార్టీల ప్రతినిధుల తరఫున, దెందులూరు నియోజకవర్గం ప్రజల తరఫున కలెక్టర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే తెలిపారు... అనంతరం కలెక్టర్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా పెదవేగి గ్రామంలో జరుగుతున్న పలు సిసి రోడ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.