కార్మికులు ఆశాజ్యోతి స్వర్గీయ డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితం

కార్మికులు ఆశాజ్యోతి స్వర్గీయ డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితం

06/April/2026 07:36    Share:   

బడుగు,బలహీన వర్గాలు, కార్మికులు ఆశాజ్యోతి స్వర్గీయ డా.బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం
డా.బాబు జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలలో  జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ ...
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,  ఏలూరు:  
స్థానిక ఓవర్ బ్రిడ్జి వద్ద ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ డా.బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి  జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ   సామాజిక సేవ చేస్తూనే కుల నిర్మూలన కొరకు అనేక ఉద్యమాలు నడిపిన సామాజిక విప్లవ యోధుడుగా బాబు జగ్జీవన్ రామ్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. రాజకీయరంగంలోనూ ప్రవేశించిన ఆయన వివిధ పదవుల్లో సమర్థంగా పనిచేసి, ప్రధానంగా కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపారన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రవేశపెట్టి ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కార్మికులు కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరి, దేశానికి, రాష్టానికి మంచి సేవలు అందించాలని సూచించారు. కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు, కార్మికులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప నాయకుడని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలని, మన పిల్లలను బాగా చదివించుకుని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భారతదేశ చరిత్రలో సుమారు 30 సంవత్సరాలు కేంద్రమంత్రులు గాను,  ఉపప్రధాని మంత్రిగా పనిచేయడం ఎంతో గర్వకారణం అన్నారు. వివిధ శాఖలను అలంకరించిన ఆయా శాఖలలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి, తనదైన ముద్రను వేశారని అన్నారు. బడుగు,బలహీన వర్గాలు కోసం అలుపు ఎరగని  పోరాడిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. స్త్రీలు కూడా విద్యావిషయంలో అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడంలో ప్రత్యేక దృష్టి పెట్టారని, స్త్రీలు చదువుకుంటే కుటుంబంతో పాటు గ్రామం అంతా చదువుకున్నట్టేనని భావించిన మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి వై.విశ్వమోహన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, పెద్దాడ వెంకటరమణ, అడబాల రవి, దొడ్డిగర్ల సుభమల్లిక్, కడిమి యోహాను, నల్లిమిల్లి శంకర్, డా.పొలిమేర హరికృష్ణ, మేతర అజయబాబు, పలు సంఘాలు నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter