శ్రీవారిని  దర్శించుకున్న ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్

శ్రీవారిని దర్శించుకున్న ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్

13/April/2026 07:26    Share:   

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, :  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి  ద్వారకాతిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.  స్థానిక పర్యటనలో భాగంగా  ద్వారకాతిరుమల విచ్చేసిన ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయానికి విచ్చేసారు. ఆలయ ఈఓ భద్రాజీ, ఆలయ అధికారులతో   ఆలయ మర్యాదలతో సురేష్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు  స్వామివారి అంతరాలయంలో సురేష్ కుమార్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనం మండపంలో సురేష్ కుమార్ కుటుంబ సబ్యులకు  వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.  అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ దంపతులకు అందజేశారు.ఆలయ ఈఓ వై. భద్రాజీ, ఆలయ అధికారి ఐ.వి. రామారావు, తదితరులు ఉన్నారు.
Breaking News

Subscribe our Newsletter