నంద్యాల రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఆర్. రాము ఎన్నిక

నంద్యాల రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఆర్. రాము ఎన్నిక

20/April/2026 21:15    Share:   

అనకాపల్లి: నంద్యాలలో ఈనెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో అనకాపల్లి జిల్లా కార్యదర్శి,ఆర్. రాము రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాసభల్లో కార్మికుల సంక్షేమం కోసం పలు కీలక తీర్మానాలు చేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అచ్యుతాపురం సెజ్, బార్క్ (BARC), ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
మహాసభలో ఆమోదించిన ప్రధాన తీర్మానాలు:
కనీస వేతనాలు: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలను పెంచాలి.
స్థానిక ఉపాధి: పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి.
వైద్య సేవలు: కార్మికులందరికీ ప్రభుత్వం ఈఎస్ఐ (ESI) సేవలను చేరువ చేయాలి.
కాలుష్య నియంత్రణ: పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.
చట్టాల అమలు: అన్ని పరిశ్రమల్లో కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని మహాసభ తీర్మానించింది.రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన ఆర్. రాముకు జిల్లాలోని పలువురు కార్మిక నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు..
Breaking News

Subscribe our Newsletter