తుమ్మపాల సంతలో అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం వెంకట నారాయణ గారు పాల్గొని సంతకు విచ్చేసిన వాహనదారులు అయిన వాన్, మోటార్ సైకిల్ మరియు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను రహదారులపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా, నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు. అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులు లేదా సరుకులు తీసుకెళ్లరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం మరియు అతివేగంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని వాహనదారులకు సూచించారు.